Expired liquor bottles: అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని సోమందేపల్లి, గుట్టూరు, అమ్మవారిపల్లిలోని వైన్ షాపులపై ఎక్సైజ్ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. వైన్ షాపుల్లో కాలం చెల్లిన బీరు బాటిళ్లను పారబోశారు.
గుట్టూరులో 110, అమ్మ వారిపల్లిలో 774, సోమందేపల్లిలోని 115 బీరు బాటిళ్లను అధికారులు ధ్వంసం చేశారు. వీటి ధర సుమారు రూ.1.20 లక్షలు ఉండొచ్చని అధికారులు చెప్పారు. కాలం చెల్లిన మద్యాన్ని ప్రజలు వినియోగిస్తే... ప్రాణాలకు ముప్పు ఉంటుందన్నారు. వాటిని ప్రజలకు విక్రయించకుండా ఉండేందుకే ఈ చర్యలు చేపట్టామని అధికారులు తెలియజేశారు.
ఇదీ చదవండి: తిరుపతి కలెక్టరేట్‌కు పద్మావతి నిలయం అప్పగింతపై హైకోర్టు స్టే