ETV Bharat / state

రూ.45 లక్షల విలువైన అల్లనేరేడు వైన్ స్వాధీనం - ఉద్దేహాల్ నాటు వైన్ వార్తలు

అనంతపురం జిల్లాలో ఎక్సైజ్ అధికారుల దాడుల్లో... భారీగా అల్లనేరేడు వైన్ బయటపడింది. మాజీ సర్పంచ్ ఈ వ్యాపారాన్ని నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు.

wine
author img

By

Published : Nov 20, 2019, 5:47 PM IST

Updated : Nov 20, 2019, 6:01 PM IST

రూ.45 లక్షల విలువైన నాటు వైన్ స్వాధీనం

అక్రమంగా నాటు వైన్ తయారు చేస్తున్న కేంద్రంపై ఎక్సైజ్, ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు మెరుపు దాడులు చేశారు. భారీగా అల్లనేరేడు పళ్ల రసాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాళ్ మండలం ఉద్దేహాల్ గ్రామ మాజీసర్పంచ్... మారుతికి చెందిన ఇళ్లు, నేరేడు తోటలో ఎక్సైజ్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్ డిప్యూటీ కమిషనర్ విజయ్​శేఖర్ ఆధ్వర్యంలో... అధికారులు ఇవాళ ఉదయం నుంచి సోదాలు నిర్వహించారు.

మారుతి అల్లనేరేడు పళ్లను కుళ్లబెట్టి నాటు వైన్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. దీని కోసం నిల్వ ఉంచిన 450 క్యాన్​లలోని 9160 లీటర్ల కుళ్లిన అల్ల నేరేడు పళ్ల రసం, మత్తు పదార్థం, వైన్ స్వాదీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్ డిప్యూటీ కమిషనర్ విజయ్ శేఖర్ తెలిపారు. వీటి విలువ దాదాపు రూ.45.80 లక్షలు ఉంటుందని వెల్లడించారు. అల్లనేరేడు పళ్ల రసం పేరుతో నిందితుడు నాటు వైన్​ను లీటర్ రూ.500లకు విక్రయిస్తున్నట్లు అధికారులు వివరించారు.

Intro:Body:Conclusion:
Last Updated : Nov 20, 2019, 6:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.