అనంతపురం జిల్లా మడకశిర ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ వారు గుడిబండ మండలం జంబులబండ గ్రామ శివారులో నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. 350 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. అధికారుల రాకను గ్రహించిన తయారీదారులు ముందుగానే పరారయ్యారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ రాజేంద్రప్రసాద్ హెచ్చరించారు.
ఇదీ చూడండి: