ETV Bharat / state

పాలబావి వద్ద గుప్త నిధుల కోసం తవ్వకాలు

అనంతపురం జిల్లా లక్ష్మీనరసింహ స్వామి తీర్థాలలో పవిత్రమైన పాలబావి వద్ద గుర్తుతెలియని వ్యక్తులు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు. గతంలోనూ పాలబావి వద్ద తవ్వకాలు జరపగా... అధికారులు పట్టించుకోవటం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

excavations for treasure hunt in ananthapur district
పాలబావి వద్ద గుప్తనిధుల కోసం తవ్వకాలు
author img

By

Published : May 24, 2020, 5:44 PM IST

అనంతపురం జిల్లా కదిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి పవిత్ర తీర్ధాలలో (క్షీరతీర్థం) పాలబావి ఒకటి. హిందూపురం రోడ్డులో ముత్యాలచెరువు వద్ద ఉన్న పాలబావి వద్ద గుప్తనిధుల కోసం గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపారు. లాక్​డౌన్ కారణంగా వాహనాల రద్దీ తక్కువగా ఉండటంతో ప్రధాన రహదారికి సమీపంలో రెండు చోట్ల తవ్వకాలు జరిపారు. గతంలోనూ పాల బావి వద్ద గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపి... పురాతన కట్టడాలను ధ్వంసం చేశారు. ఈ విషయమై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గుప్తనిధుల కోసం వెతికే వారిపై దృష్టి సారించాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి:

ఒంటరితనాన్ని భరించలేక వ్యక్తి ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.