ETV Bharat / state

'ధర్మవరంలో యువతి హత్యకు ప్రభుత్వం, పోలీసులే కారణం'

author img

By

Published : Dec 27, 2020, 4:17 PM IST

అనంతపురం జిల్లా ధర్మవరం మండలం బడన్నపల్లిలో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన యువతి కుటుంబాన్ని.. మాజీ ఎంపీ హర్షకుమార్ పరామర్శించారు. బాధితురాలి హత్యకు కారకులను ఎన్​కౌంటర్​ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం, పోలీసుల నిర్లక్ష్యమే ఈ దారుణ ఘటనకు కారణమని ఆరోపించారు.

ex mp harsha kumar
మాజీ ఎంపీ హర్ష కుమార్

ఇటీవల అనంతపురం జిల్లాలో యువతి హత్యకు కారకులైన నిందితులను ఎన్​కౌంటర్ చేయాలని.. మాజీ ఎంపీ హర్షకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధర్మవరం మండలం బడన్నపల్లిలో జిల్లాలో ఇటీవల ప్రేమోన్మాది చేతిలో ప్రాణాలు కోల్పోయిన బాధితురాలి కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. దళితులపై దాడులు, హత్యలను ప్రేరేపించేలా ప్రభుత్వం పాలిస్తోందని ఆరోపించారు. పోలీసుల నిర్లక్ష్యం ఈ ఘటనలో స్పష్టంగా కనబడుతోందన్నారు.

రాష్ట్రంలో దళితులపై దమనకాండ జరుగుతోందని హర్షకుమార్ విమర్శించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే వారికి తీవ్రస్థాయిలో అన్యాయం జరుగుతోందన్నారు. ఈ కేసులో అలసత్వం వహించిన పోలీసులను సస్పెండ్ చేసి.. నిందితులను ఎన్​కౌంటర్ చేయాలన్నారు. బాధితురాలి కుటుంబానికి రూ. కోటి పరిహారంతో పాటు చట్టపరంగా అన్ని సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

హత్యకు గురైన యువతికి న్యాయం చేయాలని కాగడల ప్రదర్శన

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.