ETV Bharat / state

'ప్రభుత్వం ఆదుకున్నట్లు క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు' - పరిటాల శ్రీరామ్ నిరాహార దీక్ష

లాక్​డౌన్​ నేపథ్యంలో నష్టపోతున్న రైతులను ప్రభుత్వం ఆదుకున్నట్లు క్షేత్రస్థాయిలో కనిపించడం లేదని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. కరోనా​ కారణంగా ఇబ్బంది పడుతున్న పేదవారిని ఆదుకోవాలని డిమాండ్​ చేస్తూ ఆమె నిరాహార దీక్ష చేపట్టారు.

మాజీ మంత్రి పరిటాల సునీత నిరాహార దీక్ష
మాజీ మంత్రి పరిటాల సునీత నిరాహార దీక్ష
author img

By

Published : Apr 18, 2020, 8:28 PM IST

లాక్​డౌన్​ కారణంగా నష్టపోతున్న రైతులను ఆదుకోవడం అన్నది.. ప్రభుత్వ ప్రకటనల్లో తప్ప క్షేత్రస్థాయిలో కనిపించడం లేదని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. కరోనా​ నేపథ్యంలో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న పేదవారిని, రైతులను, చేనేత కార్మికులను ఆదుకోవాలని డిమాండ్​ చేస్తూ ఆమె తన స్వగృహంలో నిరాహార దీక్ష చేపట్టారు. ప్రధానంగా ఐదు డిమాండ్లతో ఈ దీక్ష చేపట్టినట్లు పేర్కొన్నారు. పేదల ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లను తీసుకొస్తే వాటిని కక్షతో తీసివేశారని సునీత మండిపడ్డారు. ధర్మవరం, హిందూపురంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది చేనేత కార్మికులు లాక్​డౌన్​ కారణంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని ధర్మవరం తెదేపా ఇన్​ఛార్జ్​ పరిటాల శ్రీరాం అన్నారు. అలాంటివారికి ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక సాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి:

పేదలకు ఆర్థిక సహాయం అందించాలని ఎమ్మెల్సీ దీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.