కరోనా నియంత్రించడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు విమర్శించారు. అనంతపురం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించాలని దీక్ష చేపట్టిన మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి సంఘీభావం తెలిపారు. అనంతరం దీక్ష విరమింపజేశారు. జిల్లాలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను పూర్తి చేసి వెంటనే అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని వినియోగంలోకి తీసుకురండి: కాలువ శ్రీనివాసులు - ex minister kalava srinivasulu
అనంతపురంలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను పూర్తి చేసి వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు డిమాండ్ చేశారు.
![సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని వినియోగంలోకి తీసుకురండి: కాలువ శ్రీనివాసులు ex minister kalava srinivasulu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8271057-857-8271057-1596382265725.jpg?imwidth=3840)
ex minister kalava srinivasulu