ETV Bharat / state

కరోనా బాధితుల కోసం.. కొవిడ్​ కేంద్రాలు ఏర్పాటు

author img

By

Published : Jul 24, 2020, 11:54 PM IST

రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకొని అనంతపురం జిల్లా అధికారులు ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిని కొవిడ్​ కేర్​ సెంటర్​గా మార్పు చేశారు. బాధితుల కోసం ఇక్కడ ఏర్పాటు చేసిన సదుపాయాలను శాసన సభ్యుడు సిద్ధారెడ్డి పరిశీలించారు.

Establishment of Kovid Centers
కొవిడ్​ సెంటర్​ పరిశీలించిన శాసన సభ్యులు

అనంతపురం జిల్లా కదిరిలో కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. నెల రోజుల వ్యవధిలో కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్న వారి సంఖ్య 200 దాటినట్లు అధికారులు తెలిపారు. దీంతో నివారణ చర్యల్లో భాగంగా కంటెయిన్​మెంట్​ జోన్లలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నవారికి సేవలందించేందుకు వీలుగా కదిరి ప్రాంతీయ వైద్యశాలను కొవిడ్ ఆసుపత్రిగా మార్పు చేశారు. వాటితో పాటు పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాలలో 250 పడకల కొవిడ్ కేర్ సెంటర్​గా మార్చారు. అనుమానిత లక్షణాలు ఉన్న వారి కోసం ఏర్పాటు చేసిన సదుపాయాలను కొవిడ్ కేర్ సెంటర్​లో స్థానిక శాసన సభ్యుడు సిద్ధారెడ్డి పరిశీలించారు. పాజిటివ్ లక్షణాలు వచ్చిన వారిని ఇతర ప్రాంతాలకు పంపకుండా.. కదిరిలోనే ఐసోలేషన్ సదుపాయాలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తహసీల్దార్ మారుతి తెలిపారు.

ఇవీ చూడండి...

క్వారంటైన్​లో సమస్యలు...రోగులకు తప్పని తిప్పలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.