అనంతపురం జిల్లా ధర్మవరంలో అధికారులు మరమగ్గాలను తనిఖీ చేశారు. మరమగ్గాలపై చేనేత రకాలు తయారు చేస్తున్నారన్న ఫిర్యాదులపై.. చెన్నై, తిరుపతి నుంచి అధికారుల బృందం వచ్చి తనిఖీలు నిర్వహించింది. జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారి మనోహర్, జిల్లా డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఈ సోదాలు జరిగాయి. ధర్మవరంలో 5 చోట్ల నిబంధనలు అతిక్రమించి 100 శాతం పట్టుతో చీరలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం చేనేతకు 11 రకాలు రిజర్వేషన్ చేసిందని.. వాటిని మరమగ్గాలపై తయారుచేస్తే కేసు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు.
ఇవీ చూడండి...