నీరు లేక ఎన్నో ఏళ్లుగా పెంచుకుంటున్న ఉద్యాన తోటలు, చీని చెట్లు ఎండిపోతున్నాయి. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ముకుందాపురం, సంజీవపురం వంటి పలు గ్రామాల్లో ప్రస్తుత పరిస్థితి ఇది. గార్లదిన్నె మండలంలోని చీని కాయలు వివిధ రాష్ట్రాల నుంచి ముంబై , కోల్కతా, మహారాష్ట్ర వంటి పలు రాష్ట్రాలకు నిత్యం వందల టన్నుల్లో సరఫరా అవుతోంది. రైతు ఎంతో కాలం శ్రమించి దాదాపు మొక్క నాటిన నాటి నుంచి ఐదు సంవత్సరాల వరకు కంటికి రెప్పలా పెంచి పోషిస్తాడు. నీరు లేక ఈ రోజు కళ్లెదుటే ఎండిపోతుంటే ఏమీ చేయలేని దయనీయ పరిస్థితిలో ఉన్నాడు. రైతు తమ గోడును ఉద్యాన శాఖ అధికారుల ముందు ఎంత మెుర పెట్టుకున్నా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. ఎన్నికల కోడ్ ఉన్నందున ఏమీ చేయలేమని అధికారులు చెబుతున్నారు.
ఒక్కో రైతు రోజుకు నీటి ట్యాంకర్ పై 800 రూపాయల నుంచి 1200 రూపాయలు వరకు ఖర్చు చేస్తూ...16 నుంచి 20 ట్యాంకర్లు నీటిని మెుక్కలకు సరఫరా చేస్తున్నారు. గతంలో ముకుందాపురం చెరువుకు నీరు వదలాలని కలెక్టర్ ఆఫీస్ వద్ద దర్నా చేశారు. కానీ నీరు వదల్లేదు..కనుకే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిందని రైతులు వాపోతున్నారు.
ఇవి చదవండి....ఈ బాలకృష్ణ... గోమాత ఆపద్బాంధవుడు