ETV Bharat / state

తృటిలో తప్పిన పెను ప్రమాదం..

Electricity accident in Anantapur: కొన్ని రోజుల క్రితం జరిగిన విద్యుత్తు సంఘటన మరవకముందే .. అనంతపురంలో మరో పెను ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదాన్ని ముందుగానే గమనించిన వ్యవసాయ కూలీలు పొలంలో నుంచి పరుగు తీశారు. ప్రజల ప్రాణాలతో విద్యుత్ శాఖ చెలగాటం ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Electrical wires
విద్యుత్తు తీగలు
author img

By

Published : Nov 23, 2022, 11:25 AM IST

Electricity accident in Anantapur: అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం దర్గా హొన్నూరులో.. త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ నెల రెండో తేదీన ఇక్కడి విద్యుత్ స్తంభం వద్ద తీగలు తెగిపడిన ప్రమాదంలో.. ఐదుగురు కూలీలు మృతి చెందారు. ఆ ఘటన మరువక ముందే.. మళ్లీ విద్యుత్తు తీగలు తెగిపడ్డాయి. అంతకుముందే మంటలు రావడం గమనించిన వ్యవసాయ కూలీలు.. పొలంలో నుంచి పరుగులు తీశారు. ఏమాత్రం ఆలస్యం చేసినా పరిస్థితి దారుణంగా ఉండేదని ఆందోళన వ్యక్తంచేశారు. 20 రోజుల వ్యవధిలోనే రెండోసారి తీగలు పడిపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. ప్రజల ప్రాణాలతో విద్యుత్ శాఖ చెలగాటం ఆడుతోందని ఆగ్రహం వక్తంచేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.