ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ
అనంతపురం జిల్లా మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో.. అనంతపురం డివిజన్లో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ఈ డివిజన్లో మెుత్తం 19 మండలాలుండగా, 379 సర్పంచి, 3,736 వార్డు స్థానాలున్నాయి. ఆయా ప్రాంతాల్లో శుక్రవారంతో నామినేషన్ల ప్రక్రియ ముగిసినట్లు అధికారులు వెల్లడించారు.
నామినేషన్ల సమర్పణ ప్రక్రియ
అనంతపురం జిల్లాలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికలకు.. శుక్రవారంతో నామినేషన్ల సమర్పణ గడువు ముగిసింది. పెనుకొండ రెవెన్యూ డివిజన్లో 13 మండలాల పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. 184 గ్రామ పంచాయతీలు, 2042 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. 1544 మంది సర్పంచి పదవికి అభ్యర్థులు నామినేషన్లు వేయగా.. 5271 మంది వార్డు మెంబర్లుగా పోటీ చేసేందుకు నామపత్రాలు సమర్పించారు. ఈనెల 16తో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది.
ఎన్నికల సిబ్బంది ఆగ్రహం
ఎన్నికల విధులకు హాజరయ్యే తమకు ఆలస్యంగా భోజనాలు అందించారని.. కుందుర్పి మండల కేంద్రంలో సిబ్బంది ఆందోళనకు దిగారు. పైగా భోజనం రుచిగా లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్నం మూడు గంటలైనా తమకు భోజనం పెట్టలేదన్నారు. చేతిలో ఉన్న ఖాళీ ప్లేట్లను వాటర్ బాటిలను గాల్లోకి విసిరి.. ఎంపీడీవో వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు.
కలెక్టర్ ఆదేశాలు
ఎన్నికలు జరగనున్న ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పర్యటించి.. పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. తొలి విడతలో కొన్నిచోట్ల సిబ్బంది, ఓటర్లు ఇబ్బంది పడిన సంఘటనలు దృష్టిలో ఉంచుకొని.. ఆ సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆర్వోలను ఆదేశించారు.
ఇదీ చదవండి: పంచాయతీ పోరు: గుంటూరు నర్సింగపాడు రెండో వార్డులో పోలింగ్ నిలిపివేత