వన్యప్రాణులను చంపి వాటి మాంసాన్ని అక్రమంగా తరలిస్తున్న ఎనిమిది మంది వేటగాళ్లను అనంతపురం జిల్లా కదిరి అటవీశాఖ అధికారులు అరెస్టు చేశారు. కదిరి మండలం హిందూపురం రోడ్డులోని ఆర్ఆర్ కాలనీకి చెందిన ఎనిమిది మంది వేటగాళ్లు కడప జిల్లా పులివెందుల సమీపంలోని అటవీ ప్రాంతంలో అడవి పందులను హతమార్చి వాటి మాంసాన్ని ఆటోలో కదిరికి తరలిస్తున్నారు. ఈ విషయంపై పక్కా సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు పులివెందుల వైపు నుంచి కదిరికి వచ్చే అన్ని మార్గాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. తలుపుల మండలం కుర్లి అటవీశాఖ చెక్‌పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అప్రమత్తమై వాహనాల తనిఖీ వేగవంతం చేశారు. పులివెందుల వైపు నుంచి వచ్చిన రెండు ఆటోలను తనిఖీ చేయగా అందులో అడవిపంది మాంసం గుర్తించారు. రెండు ఆటోలతో పాటు ఎనిమిది మంది వన్యప్రాణుల అదుపులోకి తీసుకున్నారు. వారిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇదీ చదవండి: మన ఎమ్మెల్యే సింహం లాంటోడు: సీఐ వివాదాస్పద వ్యాఖ్యలు