EC Show Cause Notice For BLO's And MRO's In Anantapur District : ఎన్నికల సంఘం నిబంధనలను తుంగలో తొక్కి వైసీపీ నాయకుల ఆదేశాలను అమలు చేసిన బీఎల్వో, ఎమ్మార్వో (BLO, MRO)ల పై వేటు పడింది. అనంతపురం జిల్లా ఉరవకొండలోని ఐదు మండలాల్లో నిబంధనలను అతిక్రమించి ఓట్లు తొలగించిన 223 మంది BLOలకు, ఏడుగురు MRO లకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. డిసెంబర్ 11న షోకాస్ నోటీసులు (Show Cause Notice )ఇచ్చిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మొత్తం 3 వేల ఓట్లు నిబంధనలకు విరుద్ధంగా తొలగించారని ఆర్డీఓ నివేదిక సమర్పించగా 7 రోజుల్లో సమాధానం ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించి నోటీసులు జారీ చేశారు.
సీఈవోను కలిసిన టుమారో అధ్యక్షుడు - సచివాలయ మహిళా పోలీస్లు బీఎల్వోగా వ్యవహరించడంపై అసంతృప్తి
Election commission : ఒక్కసారి అందరికీ నోటీసులు వెళ్లడం కలకలం రేపుతోంది. 2019 నుంచి 2022 మధ్యలో చనిపోయిన , షిఫ్ట్, వలస వెళ్లిన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించే ప్రక్రియలో కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలను తుంగలో తొక్కారనే కారణంతో ఉరవకొండ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో పని చేస్తున్న 223 మంది బీఎల్వోలపై ఫిర్యాదు అందింది. 2022 అక్టోబరులో ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. 2023 జనవరిలో కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఉన్నతాధికారి స్వయంగా ఉరవకొండ వచ్చి విచారణ జరిపారు. తర్వాత ఈ వ్యవహారంపై గుంతకల్లు ఆర్డీఓను విచారణాధికారిగా నియమించారు.
ఆ జిల్లా ఓటరు జాబితాలో సీఎం జగన్ ఫొటో - ఖంగుతిన్న అసలు ఓటరు
Show Cause Notice For BLO's And MRO's : మొత్తం 3 వేల ఓట్లు నిబంధనలకు విరుద్ధంగా తొలగించారని ఆర్డీఓ నివేదిక సమర్పించారు. దీంట్లో బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని అప్పట్లోనే కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్కు అదేశాలు జారీ చేసింది. అయితే చాలాకాలం ఆ ఆదేశాలను కలెక్టర్ అమలు చేయలేదు. పయ్యావుల కేశవ్ మళ్లీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఇక చేసేది లేక అక్రమంగా ఓట్లు తొలగించిన బీఎల్వోలందరికీ నోటీసులు జారీ చేశారు.
అధికార పార్టీకి అనుకూలంగా బీఎల్ఓలు -'మీ ఇష్టం వచ్చిన చోట చెప్పుకోండి!'
Anantapur District Latest news : నిబంధనలకు విరుద్ధంగా ఓట్లు తొలగించిన, ఒకటి, రెండు ఓట్లు తొలగించిన బీఎల్వోలను క్షమించి వదిలేయాలని జిల్లా ఉన్నతాధికారులు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ప్రజాస్వామ్యంలో ఒక తప్పు చేసినా, వంద తప్పులు చేసినా శిక్ష తప్పదు అన్న రీతిలో కేంద్ర ఎన్నికల సంఘం సమాధానమివ్వడంతో అందరినీ బాధ్యులను చేస్తూ జిల్లా అధికారులు చర్యలకు ఉపక్రమించినట్లు సమాచారం.