అనంతపురం జిల్లా కదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 15 రోజులపాటు కన్నులపండువగా జరగనున్న ఈ ఉత్సవాలను పురస్కరించుకొని ఇవాళ మొదటి రోజు ధ్వజారోహణ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రత్యేకంగా రూపొందించిన ధ్వజానికి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. బ్రహ్మోత్సవాల ప్రారంభం, అలాగే ముక్కోటి దేవతలను ఆహ్వానించేందుకు చిహ్నంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.
ఇదీ చూడండి: