ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచర్లకు ప్రభుత్వం 10వేలు చెల్లించాలని అనంతపురంలోని డీఈఓ కార్యాలయం వద్ద ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులంతా నిరసన చేపట్టారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచర్లంతా కరోనా లాక్డౌన్ కారణంగా ఉపాధిలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని... అందరిలాగే తమకు ప్రభుత్వం భరోసా ఇవ్వాలని కోరారు. ఉద్యోగం లేక ఉపాధి హామీ పనులకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని వాపోయారు. ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: కుటుంబాన్ని వెలివేసిన గ్రామ పెద్దలు...ఎందుకంటే..!