కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అనంతపురంలో వారం రోజులపాటు లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. అనంత నగర పాలక సంస్థ పరిధిలో ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు లాక్డౌన్ సడలింపు ఇస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. సడలింపు సమయంలో నిత్యావసర సరుకుల దుకాణాలు సరి, బేసి పద్ధతిలో తెరిచేలా నిర్ణయించామన్నారు. నగరంలో ఆటోలు తిరగటాన్ని వారం రోజులపాటు పూర్తిగా నిషేధించామన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఆర్టీసీ బస్సులను తిప్పుతున్నట్లు తెలిపారు. మద్యం దుకాణాలకు మాత్రం లాక్డౌన్ నుంచి మినహాయింపు ఉంటుందని, అన్నిచోట్లా మద్యం అమ్మకాలు కొనసాగుతాయని అన్నారు. ఆదివారంరోజున మాంస విక్రయాలు ఉండవని, అన్ని దుకాణాలు మూసివేయాల్సినందేనని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిపై పయ్యావుల కేశవ్ ఆరా