రాజగోపాల్, నారాయణప్పకి నాగేశ్తో భూ సమస్య ఉందని తాడిపత్రి డీఎస్పీ చైతన్య తెలిపారు. ఈ క్రమంలోనే రాజగోపాల్, నారాయణప్ప హత్యకి గురయ్యారన్నారు. హత్య జరిగిన అనంతరం ఆరవేడు గ్రామంలో ఇద్దరు ఎస్సైలు, 40 మంది పోలీస్ సిబ్బందితో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశామన్నారు. రాత్రి 2 గంటల సమయంలో బాధిత వర్గం మహిళలు.. తమకు న్యాయం జరగాలని పెట్రోల్ బాటిళ్లతో వచ్చి.. మీద పోసుకొని నిప్పు అంటించేందుకు ప్రయత్నించారని.. వారిని సముదాయించి.. న్యాయం చేస్తామని చెప్పినట్లు వెల్లడించారు. అక్కడే ఉన్న కొంతమంది నిందితుల ఇంటికి నిప్పు పెట్టడానికి ప్రయత్నించగా పోలీసులు అదుపు చేశారని డీఎస్పీ తెలిపారు. నిప్పు అంటుకున్న ఇళ్లను ఫైర్ ఇంజన్ సాయంతో ఆర్పివేశామన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. అదనపు బలగాలను రప్పించి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. కొంత మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని డీఎస్పీ చైతన్య తెలిపారు.
ఇదీ చదవండి: అట్టుడుకుతున్న ఆరవేడు.. రెండు ఇళ్లకు నిప్పు పెట్టిన మృతుని బంధువులు