అనంతపురం జిల్లాలో మద్యం అమ్మకాల జోరు తగ్గడం లేదు. ధరలు పెరిగినా మద్యం ప్రియులు లిక్కర్ షాపులకు క్యూ కడుతున్నారు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించాలన్న నిబంధనను పట్టించుకోవడం లేదు. ఈక్రమంలో అధికారులు వినూత్న ఆలోచన చేశారు. మద్యం కావలసిన వారు గొడుగుతో రావాలని సూచిస్తున్నారు. గొడుగు లేకుంటే మద్యం అమ్మబోమని తేల్చిచెపుతున్నారు.
ఇదీ చూడండి..