అనంతపురంలో ఓ వ్యక్తి తాగి హల్ చల్ చేశాడు. నగరంలోని శ్రీకంఠం సర్కిల్ కూడలిలో ఆటో డ్రైవర్ తాగిన మత్తులో చేతితో రాయి పట్టుకొని బస్సు ముందర నిలబడి వీరంగం సృష్టించాడు. బస్సు కదిలిస్తే అద్దం పగులుతుందని... అందరూ తను చెప్పినట్లు వినాలని గట్టిగా అరుస్తూ ట్రాఫిక్ అంతరాయం కలిగించాడు. పక్కనే ఉన్న ట్రాఫిక్ పోలీసులు సర్ది చెప్పాలని చూసినా తాగిన మత్తులో పోలీసులపై తిరగబడ్డాడు. దీంతో పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. అనంతపురం రూరల్ నారాయణపురం గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు తెలిపారు. ఒకటో పట్టణ పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు.
ఇవీ చదవండి...భార్యతో వివాహేతర సంబంధం...వేటకొడవళ్లతో దాడి