అనంతపురం జిల్లా రొళ్ల మండలం దొడ్డేరి గ్రామ పంచాయితీ పరిధిలో ప్రభుత్వ కార్యాలయాలకు దాతలు భూములు ఇచ్చారు. క్లినిక్, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ భూమి లేనందున... భూమిచ్చే దాతలు ముందుకు రావాలని అధికారులు కోరారు. స్పందించిన ఆ గ్రామస్థురాలైన రమాదేవి కుమారుడు విజయ రంగేగౌడ్ వారి ఆధీనంలో ఉన్న 37 సెంట్ల భూమి దస్త్రాలను రొళ్ళ తహసీాల్దార్ కు అందజేశారు. వీరి దాతృత్వానికి తహసీల్దార్ హసీనా సుల్తానా అభినందించారు.
ఇదీ చూడండి. తెలుగు రాష్ట్రాలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు జలాలు కేటాయింపు