దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన 49 బస్సుల పర్మిట్లను రవాణాశాఖ అధికారులు రద్దు చేశారు. అనంతపురం జిల్లా నుంచి కర్ణాటకలోని వివిధ ప్రాంతాలకు స్టేజ్ క్యారియర్ సర్వీసులు, రాష్ట్రంలో పలు ప్రాంతాలకు కాంట్రాక్టు క్యారియర్ సర్వీసులను దివాకర్ ట్రావెల్స్ నడుపుతోంది. ఈ బస్సుల నిబంధనల ఉల్లంఘనలపై ఫిర్యాదులు రావటంతో.. రవాణాశాఖ అధికారులు అనంతపురం జిల్లాతోపాటు, పలుచోట్ల తనిఖీలు నిర్వహించారు. ఉల్లంఘనలకు పాల్పడిన 10 బస్సులను సీజ్ చేశారు. 31 స్టేజ్ క్యారియర్, 18 కాంట్రాక్టు క్యారియర్ సర్వీసులతో కలిపి.. మెుత్తం 49 బస్సులపై కేసులు నమోదు చేశారు. తాజాగా వీటి పర్మిట్లను రద్దు చేస్తూ.. అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఆయా బస్సుల్లో కొన్నింటికి నకిలీ బీమా పత్రాలు ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతో వాటిపై దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: 'నిబంధనలకు విరుద్ధంగా నడుపుతోన్న బస్సులు సీజ్'