అనంతపురం జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతోన్న దివాకర్ ట్రావెల్స్ బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. బుధవారం ఉదయం నుంచి నిరంతరాయంగా నిర్వహిస్తున్న తనిఖీల్లో ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన మొత్తం పది బస్సులను సీజ్ చేయగా... వాటిలో ఎనిమిది బస్సులు మాజీ ఎంపీ జెసీ దివాకర్ రెడ్డికి చెందినవే ఉన్నాయి. వీటిలో చాలా బస్సులను స్టేజ్ క్యారియర్లుగా నడుపుతుండగా, అనుమతి తీసుకున్నపుడు ఉన్న సీట్లకంటే అదనంగా సీట్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు. పర్మిట్‌లో తీసుకున్న సమయానికి బదులు వేరే సమయానికి నడుపుతుండడం కూడా తనిఖీల్లో వెలుగు చూసింది. అయితే ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా అప్పటికప్పుడు ఆర్టీసీ బస్సులను పిలిపించి వారిని గమ్య స్థానాలకు చేరుస్తున్నారు.
ఇదీ చూడండి: