కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో పోలీసులు... అనుసరించాల్సిన విధానాలపై జిల్లా ఎస్పీ సత్యఏసుబాబు అనంతపురం జిల్లా కదిరిలో అధికారులతో సమీక్షించారు. విధుల్లో పాల్గొంటున్న పోలీసులు తీసుకుంటున్న చర్యలు, స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారుల విషయంలో అనుసరిస్తున్న పద్ధతులను ఆయన పరిశీలించారు. ఇసుక రవాణా, అక్రమ మద్యం తరలింపు కట్టడిపై తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్ధేశం చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు.
ఇదీ చదవండి: ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్