దసరా పండుగ సందర్భంగా 223 మంది గ్రామ రెవెన్యూ సహాయకులకు,ధర్మవరం ఆర్డివో మధుసూదన్ తన సొంత ఖర్చుతో వస్త్రాలు ఇచ్చారు. కొవిడ్ నియంత్రణలో వీఆర్ఏలు(గ్రామ రెవెన్యూ సహాయకుల) చేసిన కృషి అభినందనీయమని అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు అన్నారు. తాసిల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ విచ్చేశారు .
కరోనా వ్యాప్తి ఉన్న సమయంలో రోగుల వద్దకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితులను ధైర్యంగా తెలుసుకున్నారని కలెక్టర్ అన్నారు . ధర్మవరం ఆర్డీవో స్పూర్తితో జిల్లాలోని అన్ని రెవిన్యూ డివిజన్ లలో వీఆర్ఏల కి దసరా పండుగ సందర్భంగా వస్త్రాలు అందజేస్తామని కలెక్టర్ తెలిపారు.
ఇదీ చదవండీ...భద్రాచలంలో నవరాత్రి వేడుకలు