ETV Bharat / state

సీసీపీడబ్ల్యూసీతో సైబర్‌ నేరాల నియంత్రణ: డీజీపీ

అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన సైబర్ క్రైమ్ ప్రివెన్షన్ ఎగైనెస్ట్ వుమెన్ అండ్ చిల్డ్రన్ (సీసీపీడబ్ల్యూసీ) ప్రయోగశాలను వర్చువల్ విధానం ద్వారా డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రారంభించారు.

DGP Gautam Sawang
డీజీపీ గౌతమ్ సవాంగ్
author img

By

Published : Dec 22, 2020, 7:01 AM IST

మహిళలు, చిన్నారులపై జరిగే సైబర్‌ నేరాల నియంత్రణ, నేరగాళ్లను త్వరితగతిన పట్టుకోవటానికి సీసీపీడబ్ల్యూసీ ప్రయోగశాలలు ఎంతో దోహదపడతాయని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. ఏపీ సీఐడీ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన ఈ ప్రయోగశాలను వర్చువల్‌ విధానం ద్వారా సోమవారం ఆయన ప్రారంభించారు.

సాంకేతికతను ఉపయోగించి సైబర్‌ నేరగాళ్లను పట్టుకునేందుకు వీలుగా సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు వీటిని ఏర్పాటు చేసినట్లు వివరించారు. రైల్వే డీజీపీ సీహెచ్‌.ద్వారకా తిరుమలరావు, సీఐడీ విభాగాధిపతి పీవీ సునీల్‌కుమార్‌, శాంతిభద్రతల ఏడీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

ఫిబ్రవరిలో పరిమిత పోస్టులతో డీఎస్సీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.