దేవినేని హంస ఎన్నికల ప్రచారం భాజపా అధికారంలో ఉంటేనే దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అనంతపురం భాజపా ఎంపీ అభ్యర్థి దేవినేని హంస అభిప్రాయపడ్డారు.తాడిపత్రిలో భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి అంకాల్ రెడ్డితో కలిసి రోడ్ షో నిర్వహించారు. అశోక స్థూపం నుంచి చిన్న బజార్ మీదుగా గాంధీకట్ట వరకు కార్యకర్తలతో ర్యాలీ చేశారు. . గడిచిన ఐదేళ్లలో ప్రధాని మోదీ దేశాభివృద్ధి కోసం ఎన్నో పథకాలుప్రవేశపెట్టి, వాటిని సమర్థవంతంగా అమలు చేశారన్నారు. దేశ రక్షణ వ్యవస్థను పటిష్ఠం చేసి ఉగ్రవాదులకు దీటైన సమాధానం ఇచ్చే సామర్థ్యాన్ని పెంపొందించారని తెలిపారు. కమలం గుర్తుకు ఓటు వేసి భాజపాను గెలిపించాలని కోరారు.ఇవీ చదవండి..
భవిష్యత్ బావుండాలంటే తెదేపా రావాలి: రోహిత్