ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మైనార్టీల పక్షపాతిగా ఉన్నారని ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా తెలిపారు. అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని జరిగిన మైనార్టీ ఆత్మీయసభలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఏడు నెలల కాలంలోనే 80 శాతం పూర్తి చేశామని అన్నారు. మూడు పంటలు పండే చోట రాజధానిని నిర్మించి అమరావతి ప్రాంత ప్రజలను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసం చేశారని ఆరోపించారు. నిరుపేద విద్యార్థుల తల్లిదండ్రుల కలలను సాకారం చేయడానికి ముఖ్యమంత్రి అమ్మఒడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు.
ఇదీ చదవండి: