అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని పాండురంగ స్వామి దేవాలయ ఆవరణలో ఉన్న వాణిజ్య సముదాయాల భవనాలను ఓ వ్యక్తి కూల్చివేశాడు. ఆ స్థలం తనదేనంటూ లోకేష్ అనే వ్యక్తి ఈ తతంగానికి పూనుకున్నాడు. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. లోకేష్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తామని ధర్మవరం పట్టణ సిఐ కరుణాకర్ తెలిపారు. భవనాలు కూల్చివేయడం వల్ల ఆ సముదాయంలో చిన్నపాటి వ్యాపారాలు చేసుకుంటున్నవారు రోడ్డున పడ్డారు.
ఇదీచదవండి.