గుర్తు తెలియని వాహనం ఢీకొని జింక మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా మడకశిర మండలం జమ్మలబండలో జరిగింది. అటవీ ప్రాంతం మధ్యలో ప్రధాన రహదారి ఉంది. ఈ రహదారిపై నిత్యం వందల సంఖ్యలో వాహన రాకపోకల రద్దీ ఉంటుంది. ఈ క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని జింక మృతి చెందింది. జింక కళేబరాన్ని అటవీ అధికారులు ఖననం చేశారు. వన్యప్రాణులు రోడ్డుపైకి రాకుండా వలయాలను ఏర్పాటు చేయాలని వన్య ప్రాణి ప్రేమికులు అధికారులు కోరుతున్నారు.
ఇదీ చదవండి : మేఘాద్రి రిజర్వాయర్లో గుర్తు తెలియని మృతదేహం లభ్యం