అనంతపురం జిల్లా గుత్తి రైల్వే స్టేషన్ గుండా (11041) ముంబై నుంచి చెన్నై వెళ్తున్న రైలులో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇది గమనించిన తోటి ప్రయాణికులు గుత్తి రైల్వే పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన జీఆర్పీ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనపరుచుకుని పోస్టుమార్టం నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆధార్ కార్డు ఆధారంగా మృతుడు తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన నవీన్‌గా గుర్తించారు.
ఇవీ చదవండి