అనంతపురం గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోటిపి వద్ద గురువారం అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. గోళ్లాపురం గ్రామానికి చెందిన రమేష్ బాబు(35) వ్యాపారంలో అప్పులు ఎక్కువ కావడం వల్ల ఏడాది క్రితం కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరులో ఉంటున్నాడు. గురువారం కోటిపి రైల్వేగేటు వద్ద ఆయన మృతదేహాన్ని కాలిన గాయాలతో గుర్తించారు. బుధవారం గోళ్లాపురం గ్రామస్థులతో రమేష్‌బాబు, ఆయన భార్య మాట్లాడినట్లు సమాచారం. ఎవరైనా తీసుకొచ్చి పెట్రోల్ పోసి నిప్పుపెట్టారా? ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సీఐ తెలిపారు.
ఇదీ చదవండి :