ETV Bharat / state

నాడు - నేడు పథకంలో అక్రమాలు

ప్రభుత్వ పాఠశాల్లో మౌళిక వసతుల నిర్మాణాల కోసం నాడు - నేడు కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయి. నాసిరకంగా నిర్మాణాలు చేపట్టి సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు అండతోనే దళారులు ఈ అక్రమాలకు పాల్పడుతున్నారని ప్రచారం జరుగుతోంది..

author img

By

Published : Dec 6, 2020, 12:28 PM IST

curruption in naddu nedu
నాడు-నేడు పథకంలో అక్రమాలు

పాఠశాలల్లో మెరుగైన వసతుల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం నాడు - నేడు పథకం కింద అభివృద్ధి పనులు చేపట్టింది. ఈ పనులు అక్రమార్కులకు వరంగా మారాయి. నాసిరకంగా నిర్మాణాలు చేపట్టి బిల్లులు చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ అధికారుల కనుసన్నల్లోనే జరుగుతున్నాయనే విమర్శలు లేకపోలేదు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం చిన్నముష్టూరు వద్ద ఉన్న ఆదర్శ పాఠశాలలో నాడు - నేడు పనుల్లో అక్రమాలు జరిగాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ పాఠశాలకు నాడు - నేడు కింద ప్రభుత్వం రూ.42 లక్షలు మంజూరు చేసింది. ఇప్పటి వరకు రూ.6.5 లక్షలతో మరుగుదొడ్లు, రూ.1.65 లక్షలతో విద్యుత్తు సంబంధిత పనులు జరిగాయి. అయితే ఇప్పటి వరకు రూ.18.65లక్షలు ఖర్చు పెట్టినట్లు ఆన్‌లైన్‌లో చూపుతోంది. అక్కడ జరిగిన పనులకు, ఆన్‌లైన్‌లో పెట్టిన బిల్లులకు పొంతన లేదు. ఏ పనికి ఎంత ఖర్చు చేశారని సంబంధిత అధికారులను అడిగితే పొంతలేని సమాధానం చెబుతున్నారు. అభివృద్ధి పనులకు సంబంధించి తీర్మానాలు, బిల్లుల మంజూరుకు పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు కనీసం 10 మంది సంతకాలు చేయాల్సి ఉంది. అయితే ఇద్దరు, ముగ్గురితో సంతకాలు చేయించి పనులు చక్కదిద్దుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

నాసిరకం ఇటుకల వినియోగం

పాఠశాల ప్రాంగణంలో షెడ్డు నిర్మాణ పనులను చేపట్టారు. దీని కోసం అధికారులు సిమెంటు ఇటుకలు తెప్పించారు. వినియోగించక ముందే అవి పొడిపొడి అయి పగిలిపోతున్నాయి. ఒక్కో ఇటుకకు రూ.26 చెల్లించి బిల్లు చేసుకున్నట్లు సమాచారం. ఈ ఇటుకలను వినియోగిస్తే షెడ్డు నిర్మాణం పూర్తి కాకముందే కూలే అవకాశం ఉంది. ఇటుకలు నాసిరకంగా ఉన్నాయన్న విషయం బహిర్గతం కావడంతో వాటిని వెనక్కి పంపాలని నిర్ణయించారు. అందుకు రూ.14వేలు బిల్లు రాసుకోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది.

మరుగుదొడ్లు ఉన్నా.. నిర్మించారు

పాఠశాలలో 240 మంది వరకు విద్యార్థులు ఉన్నారు. వారి సంఖ్యకు అనుగుణంగా బాలురు, బాలికలకు ప్రత్యేకంగా విశాలమైన మరుగుదొడ్లు ఉన్నాయి. అవి వాడుకలో ఉన్నప్పటికీ కొత్తగా మరుగుదొడ్లు నిర్మించడంలో అంతర్యమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. వాటి స్థానంలో మరో అభివృద్ధి పని చేపట్టినా ప్రయోజనకరంగా ఉండేదన్న వాదన ఉంది. ఏ ఉద్దేశంతో వాటిని నిర్మించారన్నది కూడా అధికారుల వద్ద స్పష్టత లేదు.

డీఈఈ విచారణ

పాఠశాలలో అభివృద్ధి పనుల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై ఎస్‌ఎస్‌ఏ డీఈఈ జయరాములు శనివారం విచారణ చేపట్టారు. ఇప్పటి వరకు చేసిన పనులు, బిల్లులకు సంబంధించిన అన్ని వివరాలను తనకు అందించాలని సైట్‌ ఇంజినీరు మంజునాథ్‌ను ఆదేశించారు. వాటి ఆధారణంగా మరోసారి పూర్తిస్థాయిలో విచారణ చేసి, పనుల తీరును నిర్ధరించనున్నట్లు ఆయన తెలిపారు. ఇదే సమయంలో బీజేవైఎం ప్రతినిధులు పాఠశాల వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు.

ఇదీ చదవండీ...ఉబికి వస్తున్న నీరు...రైతు ఇంట ఆనందం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.