ETV Bharat / state

Crops Damage Due To Power Cuts in Anantapuram: విద్యుత్‌ హామీని మరచిన జగన్‌.. ఎండుతున్న పంటలు.. ఆందోళనలో రైతన్నలు - విద్యుత్ కోతలతో అనంతపురం రైతుల తీవ్ర ఇబ్బందులు

Crops Damage Due To Power Cuts in Anantapuram: వ్యవసాయానికి 9గంటలు విద్యుత్ సరఫరా చేస్తామన్న జగన్‌ అధికారంలోకి వచ్చాక మాట తప్పారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లాలోని పలు మండలాల్లో విద్యుత్ కోతల కారణంగా బోరుబావుల్లో నీరున్నా పంటలు తడపలేని పరిస్థితిలో ఉన్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు.

Crops_Damage_Due_To_Power_Cuts_Anantapuram

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 13, 2023, 9:41 AM IST

Updated : Oct 13, 2023, 9:55 AM IST

Crops Damage Due To Power Cuts Anantapuram: విద్యుత్‌ హామీని మరచిన జగన్‌..ఎండుతున్న పంటలు..ఆందోళనలో రైతన్నలు

Crops Damage Due To Power Cuts in Anantapur : ఓవైపు విద్యుత్ కోతలు, మరోవైపు లో ఓల్టేజీ సమస్యతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వ్యవసాయానికి తొమ్మిది గంటలు పగటి పూట విద్యుత్ ఇస్తామని అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాట తప్పి అన్నదాతలను అప్పులపాలు చేస్తున్నారు.

Crop Damage Due To Power Cuts in AP : అనంతపురం జిల్లాలో పలు మండలాల్లో విద్యుత్ కోతల కారణంగా బోరుబావుల్లో నీరున్నా పంటలు తడుపలేని పరిస్థితిలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. చేతికొచ్చిన వేరుసెనగకు ఒక్క తడి ఇస్తే పదిహేను రోజుల్లో పంటను పీకొచ్చు. దీనికీ నోచుకోక ఎక్కడికక్కడ వేరుసెనగ పైరు ఎండిపోతోంది. పిందె దశలో ఉన్న బత్తాయి రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. పూత, పిందె మీద ఉన్న చెట్లకు నీరందించక పోవటంతో పిందెలు రాలిపోతున్నాయి. లో ఓల్టేజీ సమస్యతో వ్యవసాయ బోర్లు కాలిపోతూ రైతులు రెండు విధాలా నష్టపోతున్నారు. ఓట్లేసి గెలిపించిన వైసీపీ ఎమ్మెల్యేలు కన్నెత్తి కూడా చూడకపోవటంతో ప్రతిపక్ష పార్టీ నేతలవద్ద విద్యుత్ కోతలపై రైతులు మొరపెట్టుకుంటున్నారు.

Crops Dying Due Power Cuts: 'ఎండిన పొలమే సాక్షి'.. విద్యుత్ కోతలతో గగ్గోలు పెడుతున్న రైతులు.. ప్రభుత్వంపై ఆగ్రహం
Farmers Worried on Crop Loss :ఉమ్మడి అనంతపురం జిల్లాలో గత కాంగ్రెస్ పాలనలో ఎదురైన విద్యుత్ కోతలు, లో ఓల్టేజీ సమస్యలు పునరావృతమవుతున్నాయి. పగటి పూట నాణ్యమైన తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా ఇస్తామని, రైతు ప్రభుత్వం అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు కష్టాల్లో ఉన్న రైతుల వైపు కన్నెత్తి కూడా చూడక పరోవటంతో ప్రతిపక్ష నేతల వద్ద సమస్యలు చెప్పుకుంటున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లి, రామగిరి మండలాల్లో వారం రోజుల్లోనే పలు గ్రామాల్లో వందల సంఖ్యలో వ్యవసాయ బోర్ల మోటర్లు కాలిపోయాయి.

విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులతో పాటు, లో ఓల్టేజీ సమస్య కారణంగా మోటర్లు కాలిపోతున్నాయని విద్యుత్ శాఖ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులతోనే మోటర్లు, స్టార్టర్లు కాలిపోతున్నాయని, అన్ని గ్రామాల్లో సమస్య ఉందని మోటర్ మోకానిక్ చెబుతున్నారు.

Jagan Skipped Promise of Power Supply for 9 Hrs : తొమ్మిది గంటల పగటి పూట విద్యుత్ సరఫరా ఇస్తామని రైతులకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి, ప్రస్తుతం వ్యవసాయానికి ఏమేరకు సరఫరా ఇస్తున్నారో సమీక్షిస్తున్న పాపాన పోలేదనే విమర్శలున్నాయి. తొమ్మిది గంటలకు బదులు, ఏడు గంటల సరఫరా చేస్తామని చెప్పిన అధికారులు అది కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. రోజులో రెండు విడతలుగా కొద్దిరోజులు సరఫరా చేసిన విద్యుత్ శాఖ ప్రస్తుతం మూడు గంటల సరఫరానే కష్టంగా మారిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Farmers Faces Problems Due to Power Cuts: అప్రకటిత విద్యుత్ కోతలు.. ఎండుతున్న పంటలు.. ఆందోళనలో అన్నదాతలు

చాలా గ్రామాల్లో బోర్ల కింద సాగు చేసిన వేరుసెనగ పంటతో పాటు ఉద్యాన పంటలైన టమోటా, బత్తాయి లు మొక్కలకు నీరందక పూర్తిగా దెబ్బతిన్నాయి. దీనికి తోడు తీవ్ర వర్షాభావ పరిస్థితులు, వేసవిని తలపించే ఉష్ణోగ్రతలతో మొక్కలు కనీసం బతికించుకోటానికి కూడా నీరివ్వలేని పరిస్థితిలో రైతులు ఉన్నారు. విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులతో మోటర్లు కాలిపోయి వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని అన్నదాతలు వాపోతున్నారు.

ఉమ్మడి అనంతపురం జిల్లాలో 3.40 లక్షల వ్యవసాయ బోర్లు ఉన్నాయి. వీటి కింద 2.05 లక్షల హెక్టార్లలో పండ్లు, కూరగాయలు, పూలు సాగుతో పాటు, వ్యవసాయ పంటలను సాగుచేస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతలతో వ్యవసాయానికి కాకుండా, గృహ విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. గృహ విద్యుత్ వినియోగ అవసరాలు తీర్చేందుకు, ఆ వర్గాలకు కోతలు విధించకుండా, వ్యవసాయానికి భారీగా విద్యుత్ కోతలు పెట్టారు. చాలా ఫీడర్ల కింద గ్రామాల్లో రోజూ నాలుగు గంటలు కూడా నిరంతర సరఫరా ఇవ్వలేకపోతున్నారు.

Farmers Worried About Dying Crops : రాప్తాడు నియోజకవర్గంలోని పలు మండలాల్లో రైతులకు కనీసం రోజూ మూడు గంటల విద్యుత్ కూడా ఇవ్వలేని పరిస్థితి కనిపించింది. మరోవైపు లో ఓల్టేజీ సమస్యతో బోర్లు కాలిపోతూ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఒక్కసారి బోరు మోటరు కాలిపోతే పది నుంచి 12 వేల రూపాయలు వెచ్చించాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. మోటర్లు కాలిపోతున్నాయని, విద్యుత్ సరఫరా మెరుగుపరిచేలా అధికారులతో మాట్లాడాలని అనేక మంది రైతులు మాజీ మంత్రి పరిటాల సునీతను కలిశారు.

దీంతో ఆమె వ్యవసాయ మోటర్లు కాలిపోయిన గ్రామాల్లో పర్యటించారు. కనగానపల్లి, రామగిరి మండలాల్లో ఓవైపు విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతుండగా, మరోవైపు మోటర్లు కాలిపోతూ అరకొర కరెంటును కూడా వాడుకోలేకపోతున్నారు. వర్షాభావంతో వర్షాధార పంటలన్నీ పూర్తిగా చేతికి రాకుండా పోగా, ప్రస్తుతం విద్యుత్ కోతలోతో చేతికొచ్చిన పంటలు దక్కకుండా పోతున్నాయని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. చాలా గ్రామాల్లో పంటలు ఎండిపోవటంతో గొర్రెల మందను వదిలేస్తున్న దయనీయ పరిస్థితి నెలకొంది.

నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని గత మూడు నెలలుగా అనేక మండలాల్లో రైతులు విద్యుత్ ఉపకేంద్రాలను ముట్టడిస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, కలెక్టర్ ఆధ్వర్యంలో కనీసం విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష కూడా నిర్వహించని పరిస్థితి అన్నదాతలను మరింత ఆవేదనకు గురిచేస్తోంది.

Crop Damage Due To Power Cuts in AP: అప్రకటిత విద్యుత్ కోతలతో ఎండుతున్న పంటలు.. ఆత్మహత్యలే శరణ్యం అంటున్న అన్నదాతలు

Last Updated : Oct 13, 2023, 9:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.