వంటగ్యాస్ ధరల పెంపుపై సీపీఎం నేతల ఆందోళన - anantahpuram district
పెరిగిన వంటగ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ అనంతపురంలో సీపీఎం నాయకులు నిరసన చేపట్టారు. ఖాళీ సిలిండర్లను నెత్తిన పెట్టుకొని ధరల పట్టికలను దహనం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని నిరసనకారులు మండిపడ్డారు.