అనంతపురం జిల్లా కదిరిలో సీపీఎం నేతలు.. కార్మికుల సమస్యలపై మాట్లాడారు. లాక్ డౌన్ లో కార్మికులకు పూర్తి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కరోనా సేవలో ఉన్న స్కీం వర్కర్లకు, ఉద్యోగులకు, కార్మికులకు, వాలంటీర్లకు అన్నిరకాల భద్రతా పరికరాలు ఇవ్వాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. జులై 3వ తేదీన సహాయ నిరాకరణ, శాసన ఉల్లంఘన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. అందులో కార్మికులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఇదీ చదవండి: