అనంతపురం జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా.. ఆసుపత్రుల్లో మెరుగైన వసతులు కల్పించాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. నగరంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఆందోళన చేస్తున్న సీపీఎం నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఆసుపత్రిలో పడకలు ఖాళీ లేక నిత్యం కరోనా బాధితులు మరణిస్తున్నా.. జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సరిగా అమలు కావడంలేదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. వృథాగా ఉన్న ఆక్సిజన్, వెంటిలేటర్ పడకలను తక్షణ ఉపయోగంలోకి తేవాలని కోరారు.
ఇవీ చూడండి…