సీఏఏ,ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా అనంతపురంలో సీపీఎం చేపట్టిన బహిరంగ సభలో పాల్గొనేందుకు కేరళ సీఎం పినరయి విజయన్ నగరానికి వచ్చారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో అనంతపురం చేరుకున్న కేరళ సీఎంకు సీపీఎం, సీపీఐతో పాటు ఇతర వామపక్ష పార్టీల నాయకులు ఘనస్వాగతం పలికారు. ఇవాళ సాయంత్రం నగరంలోని జూనియర్ కళాశాల మైదానంలో జరగనున్న సభలో విజయన్ పాల్గొంటారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగితే అధికార పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవని తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. రాష్ట్రంలో బెదిరింపులతో సీఎం జగన్ పాలన సాగిస్తున్నారని వారు అభిప్రాయపడ్డారు. సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా జరుగుతున్న సభలో పాల్గొనేందుకు అనంతపురం వచ్చిన కేరళ సీఎం పినరయి విజయన్ ను వారు కలిశారు.
ఇవీ చదవండి: హోలీ వేళ.. కరోనాతో జర భద్రం!