అనంతపురం జిల్లా సోమందేపల్లి విద్యుత్ కార్యాలయం ఎదుట సీపీఐ నేత శ్రీరాములు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 22 ను రద్దు చేయాలని వారు ఆందోళన చేశారు.
వ్యవసాయ బోరు బావులకు విద్యుత్ మీటర్లు బిగించాలన్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల నాయకులు పాల్గొన్నారు.