ETV Bharat / state

రాష్ట్రంలో మరిన్ని రాజకీయ హత్యలు జరగొచ్చు: సీపీఐ నేత నారాయణ - Anantapur district news

CPI Narayana fire on AP Govt: రాష్ట్రంలో మరిన్ని రాజకీయ హత్యలు జరగొచ్చని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. వివేకా హత్యకేసు దర్యాప్తు చేస్తున్న... సీబీఐ అధికారుల మీదే రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెడుతోందని ఆరోపించారు. వైకాపా ప్రభుత్వ నిర్వాకంతో... సినిమాలు కూడా భయంభయంగా చూడాల్సి వస్తోందని నారాయణ అన్నారు.

CPI Narayana fire on AP Govt
CPI Narayana on politics
author img

By

Published : Feb 26, 2022, 12:41 PM IST

రాష్ట్రంలో మరిన్ని రాజకీయ హత్యలు జరగొచ్చు: సీపీఐ నారాయణ

CPI Narayana fire on AP Govt: రాష్ట్రంలో మరిన్ని రాజకీయ హత్యలు జరిగే అవకాశం ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. వివేకా హత్యకేసు దర్యాప్తు చేస్తున్న... సీబీఐ అధికారుల మీదే రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెడుతోందని ఆరోపించారు. తమ సినిమాలకు రాయితీ, ఇతరత్రా స్వార్థం కోసమే చిరంజీవి సీఎం జగన్​మోహన్ రెడ్డి వద్దకు వెళ్లి కాళ్లు, చేతులు పట్టుకున్నారని అన్నారు. అగ్ర కథానాయకుడైన చిరంజీవి.. సినిమా టికెట్ల గొడవపై ప్రభుత్వంతో మాట్లాడటానికి ఇతర సంఘాలను తీసుకెళ్లాలనే ఆలోచన చేయలేదన్నారు.

అందుకే యువత తిరగబడుతుంది..
సినిమా టికెట్ల ధరలపై ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవటం కారణంగానే యువత తిరగబడుతున్నారని నారాయణ తెలిపారు. తాను కూడా రాత్రి బీమ్లా నాయక్ సినిమాకు వెళ్లొచ్చానన్న నారాయణ.. ప్రభుత్వం నిర్వాకంతో సినిమాకు వెళ్లిన వారు లోపల భయంగా ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అఖండ, బీమ్లా నాయక్ సినిమాలు సమాజానికి సందేశాన్ని ఇచ్చేవి కాకపోయినా.. వినోదం పంచుతున్నాయని తెలిపారు.

ఇదీ చదవండి:

KCR Flexi: విజయవాడలో కేసీఆర్ భారీ ఫ్లెక్సీ.. ‘హ్యాట్సాఫ్‌ సీఎం సార్‌’ అంటూ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.