తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులు విక్రయించాలన్న పాలకమండలి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ అనంతపురం జిల్లా కదిరిలో రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నాయకులు నిరసన ప్రదర్శన చేపట్టారు. పార్టీ కార్యాలయంలో భౌతిక దూరం పాటిస్తూ ఆందోళన చేశారు.
స్వామి వారి ఆస్తులను అమ్మాలనే ఆలోచనను తీసుకునే వెనక్కు తీసుకునే వరకు నిరసన కొనసాగుతుందని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నాయకులు స్పష్టం చేశారు.