ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంతోనే చాలా మంది చనిపోతున్నారని.. అలాంటి బాధితుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలంటూ సీపీఐ నాయకులు డిమాండ్ చేస్తూ.. అనంతపురంలోని ప్రభుత్వాస్పత్రి వద్ద నిరసన చేపట్టారు. వారం రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులలో ఆక్సిజన్ కొరత వల్ల కరోనా బాధితులు మృతిచెందినా.. ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు.
ప్రభుత్వ పెద్దలు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వెంటనే అత్యవసర చికిత్సగా ప్రకటించి వ్యాక్సినేషన్ ఉచితంగా అందివ్వాలని అన్నారు. 5000 పడకలు అదనంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లకు స్పందించని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: