ETV Bharat / state

జిల్లాలో కరోనా దూకుడు.. పల్లెలకూ వేగంగా విస్తరిస్తున్న వైరస్ - అనంతపురం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల తాజా వార్తలు

అనంతపురం జిల్లాలో కరోనా దూకుడు పెంచింది. దాదాపు అన్ని మండలాల్లోనూ ఈ మహమ్మారి చాపకింద నీరులా పాకింది. మొన్నటి దాకా పట్టణాలకే పరిమితమైనా... ఇప్పుడు పల్లెలకు విస్తరించింది. ఎవరికి వారుగా నిర్దేశిత స్వీయ జాగ్రత్తలు తీసుకుంటే తప్ప ఈ మహమ్మారిని కట్టడి చేయడం అసాధ్యమని అధికారులు చెబుతున్నారు.

జిల్లాలో కరోనా పెంచిన దూకుడు
జిల్లాలో కరోనా పెంచిన దూకుడు
author img

By

Published : Jun 24, 2020, 4:44 PM IST

అనంతపురం జిల్లాలో దూకుడు పెంచిన కరోనా

అనంతపురం జిల్లాలో కరోనా వైరస్ జడలు విప్పుతోంది. మార్చి 29న పదేళ్ల బాలుడిలో వైరస్ కనిపించింది మొదలు ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 1234 మందికి ఈ వైరస్​ సోకింది. హిందూపురం కేంద్రంగా.. దిల్లీ నుంచి తిరిగివచ్చిన వారి నుంచి విస్తృతంగా వ్యాప్తి చెందిన వైరస్ ఇప్పుడు పల్లెలకు కూడా పెద్దఎత్తున పాకుతోంది. ముంబయి నుంచి వచ్చిన వలస కూలీల్లో వంద మందికి పైగా వైరస్ బయటపడింది. వారిద్వారా గ్రామాలకూ విస్తరించింది. జిల్లాలో విదేశీయులు రాకపోకలు సాగించే మూడు ప్రధాన కేంద్రాల ద్వారా స్థానికులకు వైరస్ సోకి, తద్వారా విస్తృత వ్యాప్తికి కారణమైంది. ఈ వైరస్ ఇంతటితో ఆగకుండా జైళ్లకు కూడా పాకుతోంది. అనంతపురం, హిందూపురం, తాడిపత్రి జైళ్లకు రిమాండ్ నిందితుల ద్వారా అప్పటికే జైలులో ఉన్న ఖైదీలకు సోకినట్లు తెలుస్తోంది. జూలై నెలలో నాలుగు వేలమందికి వైరస్ సోకే అవకాశం ఉందని అంచనా వేసిన జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులు వైద్యం కోసం యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు.

లాక్​డౌన్​, భౌతిక దూరం వంటి చర్యలతో అదుపులోనే ఉందనుకున్న కొవిడ్​-19 ఇప్పుడు విజృంభిస్తోంది. ప్రభుత్వ కార్యాలయాలు మొదలు పల్లెల్లో పొలం పనులు చేసుకునే వారి వరకు వేగంగా విస్తరిస్తోంది. ఏప్రిల్ నెలంతా హిందూపురం కేంద్రంగా దిల్లీ నుంచి తిరిగి వచ్చిన వారి ద్వారా పెద్ద ఎత్తున వ్యాప్తి చెందిన వైరస్ ఆరుగురిని పొట్టనపెట్టుకుంది. హిందూపురంలోని పలు కాలనీల్లో రెండు వందల మందికి పైగా వైరస్ సోకింది. వారిద్వారా వైద్యులు, నర్సులు ఇలా అందరికీ సోకిన పరిస్థితిని చవిచూడాల్సి వచ్చింది. హిందూపురంలో పరిస్థితి అదుపులోకి వస్తుందనుకునే సమయంలో ముంబయి నుంచి 968 మంది వలస కూలీలను తీసుకొచ్చిన రైలు, వైరస్​ను కూడా మోసుకొచ్చిందని అధికారులు గుర్తించలేకపోయారు. ఈ విషయంలో జిల్లా యంత్రాంగం పూర్తిగా విఫలమైందనే చెప్పాలి. హిందూపురం జైలులో ఆరుగురు ఖైదీలకు వైరస్ సోకిందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.

వైరస్ వ్యాపించిందిలా..

వలస కూలీలను ఉంచిన ఉరవకొండ, విడపనకల్లులోని క్వారంటైన్ కేంద్రాల్లో సరైన సౌకర్యాలు కల్పించకపోవటంతో వారంతా తీవ్రంగా నిరసన వ్యక్తంచేశారు. దీనికి తోడు ఆయా కేంద్రాల వద్ద గట్టి భద్రత ఏర్పాటు చేయకపోవటంతో వలస కూలీలు తమ బంధువులతో కలిసి భోజనం చేస్తూ, విచ్చలవిడిగా వెలుపల తిరిగారు. ఫలితంగా వైరస్ స్థానికంగా చాలా మందికి సోకింది. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రుల్లో మృతి చెందిన వృద్ధులకు కరోనా పరీక్షలు నిర్వహించకుండానే బంధువులకు అప్పగించారు. ఇలా మృత దేహాలకు అంత్యక్రియలు చేసిన వారు కూడా వందల సంఖ్యలో వైరస్ బాధితులుగా మారిపోయిన వైనానికి నిర్లక్ష్యమే కారణంగా కనిపిస్తోంది. వైరస్ సోకిన బాధితుల సంఖ్యను ప్రకటించటంలో కూడా జిల్లా అధికార యంత్రాంగం గోప్యతగా వ్యవహరించిన తీరు సర్వత్రా విమర్శలకు దారితీసింది. మరోవైపు జిల్లా యంత్రాంగం తీరుతో కిందిస్థాయి అధికారుల్లో అప్రమత్తత లోపించి, ప్రజల్లో వైరస్ పట్ల నిర్లక్ష్య ధోరణి పెరిగిపోయి వేగంగా వ్యాప్తికి కారణమవుతోంది. ఇది ఇంతటితో ఆగదని జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి చెబుతున్నారు.

ప్రస్తుతం జిల్లాలో మూడు రోజులుగా అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మూడు రోజుల కిందట 97 మందికి వైరస్ సోకినట్లు నిర్థరణ కాగా, వరుసగా 70, 68 మందికి పాజిటివ్​గా తేలింది. ఇవాళ కొత్తగా జిల్లాలో 90 మంది వైరస్ బారిన పడినట్లు ప్రయోగశాల నివేదికలు చెబుతున్నాయి. జిల్లాలో దిల్లీ వెళ్లివచ్చిన వారి ద్వారా విస్తరిస్తున్న విషయం గుర్తించే లోపే, విదేశీయుల రాకపోకలు ఎక్కువగా ఉండే పుట్టపర్తి, ఆర్డీటీ, కియా పరిశ్రమలకు వచ్చిన వారు స్థానికంగా ఎక్కువ మందికి వైరస్ అంటించినట్లు నిర్థరణ అయింది.

ప్రధానంగా 3 కారణాలు

జిల్లాలో వైరస్ జడలు విప్పటానికి ప్రధానంగా మూడు అంశాలే కారణంగా అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనలో తేల్చారు. విదేశీయులు, దిల్లీ నుంచి తిరిగివచ్చినవారు, వలస కూలీల నుంచి వ్యాప్తిని గుర్తించి చర్యలు తీసుకునేలోపే వందలాది మందికి వ్యాధి విస్తరించింది. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన 53 వేల కరోనా పరీక్షల్లో 1234 మందికి వైరస్ సోకినట్లు తేలింది. వీరిలో 800 మంది ప్రస్తుతం కోవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, మిగిలిన వారంతా వైరస్ తగ్గి ఇంటికెళ్లారు. ఇంత తీవ్ర స్థాయిలో విస్తరించిపోతున్న వైరస్ జూలై తొలి వారానికి 4000 మందికి కొత్తగా సోకుతుందని వైద్యఆరోగ్యశాఖ అంచనా వేసింది. దీనికి తగినట్లుగా జిల్లాలో యుద్ధ ప్రాతిపదికన వైద్య సహాయం అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 34 క్లస్టర్లలో వైరస్ బాధితులకు చికిత్స అందించటానికి కోవిడ్ ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు కల్పించినట్లు కలెక్టర్ చెబుతున్నారు.

ఈ నెల 21 న మళ్లీ అమల్లోకి వచ్చిన లాక్ డౌన్

జిల్లా వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న వైరస్​ను అదుపు చేయటానికి ఈనెల 21 నుంచి నగరపాలక సంస్థ పరిధిలో మళ్లీ లాక్​డౌన్ విధించారు. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు మాత్రమే నిత్యావసర సరుకుల దుకాణాలు తెరుచుకునేందుకు అధికారులు అవకాశం ఇచ్చారు. నిబంధనలు కఠినంగా అమలు చేస్తామని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం లాక్​డౌన్​ ఎత్తివేసిందని ఆనందపడిన చిన్న వ్యాపారులు, దుకాణ దారులకు మళ్లీ లాక్​డౌన్​ విధించటం పిడుగుపాటుగా మారింది. ఇప్పటికే మూడు నెలలుగా పనిలేక ఇంటికే పరిమితమైన వలస కూలీలు, చిరు వ్యాపారులు, దుకాణాల్లో పనిచేసే కార్మికులు ఇలా అనేక మంది చేతిలో డబ్బుల్లేక కుటుంబ పోషణ భారమై అల్లాడిపోతున్నారు. కూరగాయలు, పండ్లు సాగుచేసిన రైతులంతా అయినకాడికి దళారులకు ఇచ్చేసి తిరిగి ఊరికి వెళుతున్నారు. జిల్లాలో 5000 పడకలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. జూలైలో బాధితుల సంఖ్య పెరుగుతుందని అంచనావేసి మూడు కళ్యాణ మండపాలు కూడా కోవిడ్ కేంద్రాలుగా మార్చడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. లాక్​డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తామని, ఎవరూ ఇంటి నుంచి అనవసరంగా రోడ్లపైకి రావొద్దని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.

ముందుంది అసలు ప్రమాదం

ఇప్పటికే ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి వైరస్ విస్తరించటంతో రెండు శాఖలకు చెందిన జిల్లా కార్యాలయాలు మూసేశారు. వైద్య వర్గాల హెచ్చరికల మేరకు జూలై నెలలో సమస్య ఏ మేరకు పెరగనుందోనని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇదీ చూడండి: కొత్తగా 497 కరోనా కేసులు... పదివేలు దాటిన బాధితులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.