ETV Bharat / state

రూ. 9 కోట్ల వ్యయంతో తాత్కాలిక కొవిడ్ ఆసుపత్రి నిర్మాణం - అనంతపురం జిల్లాలో కొవిడ్ ఆసుపత్రి వార్తలు

అనంతపురం జిల్లాలో పెరుగుతున్న కరోనా బాధితులను దృష్టిలో పెట్టుకుని 1500 పడకలతో కొవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. రాప్తాడు మండలంలోని రామినేపల్లి వద్ద ఉన్న వేర్ హౌసింగ్ గోదాముల్లో ఈ తాత్కాలిక కొవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. రూ. 9 కోట్ల వ్యయంతో, అత్యాధునిక వైద్య సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆగస్టు 15లోపు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా పనులు జరుగుతున్నాయి.

covid hospital in raminepalli ananthapuram district
అనంతపురం జిల్లాలో రూ. 9 కోట్లతో తాత్కాలిక కొవిడ్ ఆసుపత్రి
author img

By

Published : Jul 29, 2020, 11:35 AM IST

అనంతపురం జిల్లాలో కరోనా బాధితులకు వైద్యం అందించేందుకు 1500 పడకలతో తాత్కాలిక ఆసుపత్రి సిద్ధమవుతోంది. కొవిడ్ లక్షణాలు కనిపించిన వెంటనే ఇక్కడకు తీసుకువచ్చి చికిత్స అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రామినేపల్లి వద్ద వ్యవసాయ ఉత్పత్తులు నిల్వ చేయడానికి నిర్మించిన 5 భారీ గోదాముల్లో ఈ ఆసుపత్రి ఏర్పాటు చేస్తున్నారు. ఇందు కోసం ప్రభుత్వం రూ. 9 కోట్లు కేటాయించింది.

ఆగస్టు 15 నాటికి ఆ తాత్కాలిక ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకు రావాలని అధికార యంత్రాంగం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే సివిల్, ఎలక్ట్రికల్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు 300 మంది కూలీలు పనిచేస్తున్నారు. మహిళలు, పురుషులకు వేర్వేరు కంపార్ట్​మెంట్లు సిద్ధం చేస్తున్నారు. ఒక్కో కంపార్ట్​మెంట్​లో 125 పడకలు ఏర్పాటు చేస్తున్నారు. 200 మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. నీటి సౌకర్యం కోసం 4 బోర్లు వేయగా రెండింటిలో నీళ్లు వస్తున్నాయి.

నీటిని నిల్వచేసేందుకు 2 భారీ సంపులు కట్టారు. వంటగది, వైద్యులు విశ్రాంతి తీసుకునేందుకు గదులు, ప్రత్యేక ఫుడ్ కోర్టు నిర్మిస్తున్నారు. పరుపులు, వైద్య పరికరాలు మరో వారం రోజుల్లో తీసుకొచ్చే విధంగా ప్రణాళికలు వేశారు. ఈ కొవిడ్ కేర్ సెంటర్ అందుబాటులోకి వస్తే బాధితుల ప్రాణాలకు భరోసా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇక్కడ అవసరమైన వైద్యులు, నర్సింగ్ సిబ్బంది కోసం జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది.

ఇవీ చదవండి:

పొలాల్లో ఆరబోసిన వంద బస్తాల వేరుశనగ చోరీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.