అనంతపురం జిల్లాలో రోజు రోజుకూ కొవిడ్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పట్టణంలోని దుకాణాలు, షాపింగ్ మాల్స్ల్లో కొవిడ్ నిబంధనలు పాటించని వారిపై జరిమానా విధిస్తున్నారు. గుంతకల్లు పట్టణంలోని పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.
రోడ్డుపై మాస్కులు పెట్టుకోకుండా తిరుగుతున్న వారిపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కలెక్టర్ ఉత్తర్వుల మేరకు మొదటిసారి నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.1000 విధిస్తున్నామని.. రెండోసారి అయితే దుకాణాలు మూసివేస్తామని గుంతకల్లు ఎమ్మార్వో హరికుమార్ తెలిపారు. అంతే కాకుండా యజమానులపై కేసు నమోదుచేస్తామని డీఎస్పీ ఖాసీంసాబ్ హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ.. కొవిడ్ నిబంధనలు తప్పకుండా అనుసరించాలని ఆదేశించారు.
ఇదీ చదవండి: