కొవిడ్ చికిత్స కోసం జిల్లాలోని బత్తలపల్లి మండలం ఆర్డీటీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని ఆర్డీటీ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం డైరెక్టర్ అన్నెఫెర్రర్తో కలిసి జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ప్రారంభించారు. కరోనా బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రైవేటు ఆసుపత్రులలో కొవిడ్ కేర్ సెంటర్లు ప్రారంభిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. కరోనా వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు.
బాధితులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని.. అందరికీ అందుబాటులో కొవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేశామని అన్నారు. కరోనాపై ఇప్పటికే జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీటీ ఆసుపత్రి డైరెక్టర్ మంచు ఫెర్రర్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: