వివాదంలో ఉన్న భూమికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసిన విషయంలో అనంతపురం ఆర్డీవో గుణ భూషణ్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని అనంతపురం జిల్లా కోర్టు ఆదేశించింది. ఈ మేరకు రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో ఆర్డీవోపై కేసు నమోదైనట్లు సీఐ జాకీర్ హుస్సేన్ తెలిపారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం, లత్తవరం గ్రామంలో మూడు ఎకరాల ఆరు సెంట్ల భూమికి సంబంధించి అదే గ్రామానికి చెందిన సాకే ఆనంద్ అన్నదమ్ములకు 2011 నుంచి భూవివాదం నెలకొంది. ఈ వివాదానికి సంబంధించిన అంశం కోర్టు పరిధిలో ఉంది. దీనిని పరిశీలించకుండా ఆర్డీవో 23 లక్షల తొంభై మూడు వేలకు బిల్లు పాస్ చేస్తూ పేదలకు ఇవ్వాలని స్థానిక అధికారులను ఆదేశించారు. దీనిపై ఆనంద్ కుమార్తె రోజా... ఆర్డీవోపై చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు సోమవారం జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. దీనిపై విచారణ అనంతరం తదుపరి వివరాలు వెల్లడిస్తామని సీఐ తెలిపారు.
ఆర్డీవోపై కేసు నమోదు చేయాలని అనంతపురం కోర్టు ఆదేశం - అనంతపురం తాజా వార్తలు
అనంతపురం ఆర్డీవో గుణభూషణ్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని అనంతపురం కోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఆర్డీవోపై కేసు నమోదైనట్లు సీఐ జాకీర్ హుస్సేన్ తెలిపారు.