అనంతపురం జిల్లా ధర్మవరంలో కరోనా యోధులను ఆర్టీఓ సత్కరించారు. షిరిడి సాయిబాబా కల్యాణ మండపంలో 200 మందిని సేవాసంస్థల ప్రతినిధులు, అధికారులు సన్మానించారు ఆర్టీవో మధుసూదన్ వివిధ శాఖలలోని సిబ్బందికి.. వారి సేవలకు గుర్తుగా జ్ఞాపికను అందించారు. కొత్త దుస్తులను అందజేశారు. ధర్మవరంలో రెవెన్యూ, వైద్య, మున్సిపల్, పోలీసు సిబ్బందితోపాటు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కరోనా కట్టడికి సమర్థవంతంగా పని చేశారని ఆర్టీఓ అన్నారు.
ఇదీ చూడండి. 'నేను బతకడం ఇష్టం లేకపోతే.. ఊరు వదిలి వెళ్లిపోతా.. ఆ తరువాత చావే'