ETV Bharat / state

అంబులెన్స్ కోసం కరోనా బాధితుడి పడిగాపులు - కూడేరు తాజా వార్తలు

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల భారీగా అంబులెన్స్​లను ప్రారంభించింది. అయినా కొన్నిచోట్ల అవి ప్రజలకు సత్వర సేవలు అందించటం లేదు. అనంతపురం జిల్లాలో జరిగిన ఓ ఘటన ఇందుకు నిదర్శనం.

corona patient problem
corona patient problem
author img

By

Published : Jul 29, 2020, 7:52 PM IST

అంబులెన్సు సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ కరోనా బాధితుడు పడిగాపులు కాయాల్సి వచ్చింది. సమాచారం ఇచ్చి గంటలు గడిచినా అంబులెన్సు రాకపోవటంతో అతను తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా కూడేరులో జరిగింది.

కూడేరుకు చెందిన ఓ వ్యక్తి రెండు రోజుల క్రితం కొవిడ్ పరీక్ష చేయించుకున్నాడు. పరీక్షల్లో పాజిటివ్​గా నిర్ధారణ అయినట్లు అతనికి స్థానిక ఏఎన్​ఎం ఒకరు సమాచారం ఇచ్చారు. అనంతరం విషయాన్ని ఆమె ఉన్నతాధికారులకు తెలిపింది. బాధితుడిని ఆసుపత్రికి తరలించేందుకు వారు బుధవారం ఉదయం 11 గంటలకు 108 అంబులెన్స్​కు సమాచారం ఇచ్చారు. సాయంత్రం అయినా అంబులెన్స్ అక్కడికి రాలేదు. కరోనా సోకిన వ్యక్తి వాహనం కోసం ఎదురుచూస్తూ కూడేరు ఎంపీడీవో కార్యాలయం వద్ద ఓ చెట్టు కిందే ఉండిపోయాడు. అతని ఆరోగ్యం క్షీణించకముందే ఆసుపత్రికి తరలించాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చదవండి

రాష్ట్రంలో కరోనా ఉగ్రరూపం.. 24 గంటల్లో 10,093 కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.