అనంతపురం జిల్లా కదిరిలో కరోనా వైరస్ విస్తరించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. శనివారం ఒక్కరోజే పట్టణంలో పదిమందికి వైరస్ అనుమానిత లక్షణాలు ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. పట్టణంతో పాటు తలుపుల మండలం, కుమ్మర వాండ్లపల్లి, వెంగలమ్మ చెరువు గ్రామాలలో మరో ఐదుగురికి కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలున్నట్లు అధికారులు ప్రకటించారు. కదిరిలో ఇప్పటి వరకు కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 50కు చేరింది. కరోనా వైరస్ విస్తరిస్తుండటంతో అప్రమత్తమైన అధికారులు మున్సిపల్, సచివాలయ, రెవెన్యూ సిబ్బందితో సమావేశమయ్యారు. పట్టణంలో చేపట్టాల్సిన చర్యలపై తహసీల్దార్ మారుతి పలు సూచనలు చేశారు. నిబంధనలు కఠినతరం చేస్తూ తొమ్మిది గంటలకే అత్యవసరం మినహా మిగతా దుకాణాలు మూసి వేసేలా చర్యలు చేపట్టారు.
ఇవీ చూడండి...: సచివాలయ మహిళా ఉద్యోగిపై వైకాపా నేత దాడి